15న రహదారి భద్రతా కమిటీ సమావేశం


Ens Balu
19
Parvathipuram
2023-02-13 13:24:51

రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని ఈ నెల 15వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం జిల్లా రవాణాశాఖాధికారి సి.మల్లికార్జున రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో  కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. జిల్లాలో శాఖల వారీగా చేపట్టాల్సిన రహదారి భద్రతా కార్యక్రమాలపై సమావేశంలో  చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని రహదారి భద్రతా కమిటీ సభ్యులు అందరూ హాజరుకావాలని ఆయన కోరారు.