రాజమండ్రి పోలీస్ స్పందనకు 28 అర్జీలు
Ens Balu
23
Rajamahendravaram
2023-02-13 13:49:35
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పోలీస్ స్పందన కార్యక్రమానికి 28 అర్జీలు వచ్చినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఎం.రజనీ తెలియజేశారు. సోమవారం జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులతో జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్వయంగా ముఖాముఖిగా మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను జాప్యం లేకుండా తక్షణమే పరిష్కారం చేస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఏఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.