గాన గంధర్వుని లేని లోటు తీరనిది..


Ens Balu
2
Visakhapatnam
2020-09-25 19:09:35

గానగంధర్వుడు ఎస్‌.‌పి బాలసుబ్రహ్మణ్యం మృతి బాధాకరమని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఆయన గానంతో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలచి ఉంటారన్నారు. విభిన్న భాషల్లో వేలాది గేయాలను ఆలపించి దేశ వ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. బాలసుబ్రహ్మణ్యం మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని  వీసీ ప్రసాద రెడ్డి వ్యక్తం చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం బాలసుబ్రహ్మణ్యంకు కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్‌) ‌ను గతంలో అందించిన విషయాన్ని ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి గుర్తుచేసుకున్నారు. 2009లో జరిగిన స్నాతకోత్సవంలో ఎస్‌.‌పి బాలసుబ్రహ్మణ్యం కళాప్రపూర్ణను స్వీకరించారని మననం చేసుకున్నారు. ఇటువంటి మధుర గాయకుని మరణం తీరని లోటన్నారు.