డా.శంకరరావుకి ఘన నివాళి..
Ens Balu
2
Eluru
2020-09-25 19:16:11
డా.శంకరరావు మరణం తనను ఎంతగానో కలిచివేసిందని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆవేదన వ్యక్తం చేస్తూ డా .శంకరరావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియచేశారు. జిల్లా కేంద్రప్రభుత్వ ఆసుపత్రిలో డిసిహెచ్ఎస్ గా సుదీర్గకాలం ఎంతో సమర్దవంతంగా సేవలు అందించి గత నెల 31వ తేదీన పదవీవిరమణచేసిన ఆయన అనారోగ్య కారణంగా హైదరాబాదు యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈనెల 24వ తేదీ గురువారం మరణించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఏలూరు కలెక్టరేట్ లో శుక్రవారం డా.శంకరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కాలంలో అహర్నిశలు శ్రమించి వైద్య సిబ్బందికి అండ గా నివడమే కాకుండా కోవిడ్ బారినపడిన రోగులకు మంచిసేవలు అందించారని వైద్య వృత్తిలో ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు . మంచి అధికారిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. కోవిడ్ ప్రారంభమైన రోజు నుండి పదవీ విరమణ పొందిన రోజు వరకు ప్రతిరోజు తనను కలిసి సమర్దవంతంగా విధులు నిర్వర్తించే వారిని డా .శంకరరావుతో వున్న అనుబంధాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కోవిడ్ పట్ల ప్రతిఒక్కరూ చాలా అప్రమత్తతా ఉండాలని ముందుజాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైన మార్గమన్నారు. ఎవరికివారు నాకు కోవిడ్ రాదులే అని భావించవద్దని నిర్లక్ష్యం అశలుపనిరాదని అన్నారు. ఎవరికి వారు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను,రక్షణను దృష్టిలో వుంచుకోవాలన్నారు. కోవిడ్ లక్షణాలు వచ్చిన వెంటనే ఏమాత్రం అశ్రద్దచేయకుండా పరీక్షలు చేయించుకుని తగిన వైద్యం చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం , శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించాలని అప్పుడే కోవిడ్ భారిన పడేప్రమాదం చాలావరకు తప్పుతుందన్నారు. గాన గంధర్వుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యంకు అందుబాటులోలేని చికిత్స అంటూ ఏదీలేదని, అయినప్పటికీ వారు మనకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి గాయకుడు భవిష్యత్ లో వస్తారనే నమ్మకంలేదని ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. కోవిడ్ ఎవరికి ఎలా వస్తుందో తెలియదని వాక్సిన్ వచ్చేంతవరకు ప్రతిఒక్కరూ అప్రమత్తగా ఉండడమే మేలైన మార్గమని కలెక్టర్ రేవు ముత్యాలరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ ) కె వెంకటరమణారెడ్ది, జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్ ) హిమాన్సుశుక్లా, డిఆర్ఒ ఎస్ శ్రీనివాసమూర్తి, ఏలూరు కేంద్రప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియ ఇన్‌చార్జి డిసిహెచ్ఎస్ డా. ఎవిఆర్ మోహనరావు, డియంఅండ్ హెచ్ఒ డా. సునంద, ఆశ్రమ కోవిడ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా .రవికుమార్ , మార్క్‌ఫెడ్ జిల్లా అదికారి కుమారి మల్లిక , డిస్ట్రిక్ట్ కోవిడ్ సర్వేలైన్స్ ఆఫీసర్ డా .జోషి,కలెక్టరేట్ వివిద విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.