సోమశేఖ ఆలయంలో శనిత్రయోదశి ప్రత్యేక పూజలు
Ens Balu
22
Scindia
2023-02-17 01:34:31
విశాఖలోని సింథియా మల్కాపురంలోని హిందూస్థాన్ షిపియార్డ్ కార్మికుల నివాసా సముదాయములో ఒక చిన్న కొండపై వెలసియున్న శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి సహిత సోమశేఖర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 18న శనిత్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు అర్చకులు కామేశ్వర శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, శనిత్రయోదశి సంయుక్త మహాశివరాత్రి చాలా అరుదుగా( 27 ఏళ్లకు) వస్తుందన్నారు. ఆ మహాపర్వదినాన, శని పూజలు చేయించుకుంటే గోచార రీత్యా శనైశ్చరస్వామి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మహా విశేష ఫలితాన్ని ఇస్తాడని అన్నారు. జన్మ లగ్నమును బట్టి గోచారాన్ని బట్టి జన్మశని, అర్ధాష్టమ శని ఏలినాటి శని దోషముల నుండి నివృత్తి చెందుటకు శనేశ్వర స్వామి వారికి చేసే తైలాభిషేకముతోపాటు, శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమశేఖరస్వామి వార్లకు ప్రదోషకాలాభిషేకములు చేయించుకున్నవారికి వెయ్యి రెట్లు అధిక ఫలితము లభిస్తుందని వివరించారు.