ఉగాది నాటికి జిల్లాలో 6319 ఇళ్లు పూర్తిచేయాలి..


Ens Balu
15
Rajamahendravaram
2023-02-17 11:25:32

ఉగాది నాటికి జిల్లాకు నిర్దేశించిన 6319 ఇళ్ళ నిర్మాణం పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీ లత స్పష్టం చేశారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో  తొమ్మిది అజెండా అంశాల హౌసింగ్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్ జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో హౌసింగ్, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సమగ్రంగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆమేరకు పురోగతి సాధించాలని అన్నారు. ఇప్పటికే ఇళ్ళ నిర్మాణ పనులు పురోగతి ఉన్న లబ్దిదారులకు మరింత ప్రోత్సాహం ఇవ్వవలసి ఉందన్నారు. ఉగాది నాటికి జిల్లాకు 6319 ఇళ్ళ లక్ష్యం కుగాను1,862 పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ లో 998, కొవ్వూరు అర్బన్ 450, అనపర్తి 512, కొవ్వూరు రూరల్ 298, బిక్కవోలు 245 పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. స్టేజ్ కన్వర్షన్ లో బి ఎల్ - 8819, ఆర్ ఎల్ - 1862, ఆర్ సి - 806 ఉన్నాయని అన్నారు. రాబోయే 30 రోజులు అత్యంత కీలకం అన్నారు.  స్టేజ్ కన్వర్షన్ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ స్పష్టం చేశారు. 

స్వంత స్థలం లో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. జిల్లాలో ప్రత్యేక సర్వే ద్వారా అత్యంత ప్రాధాన్యత కలిగిన 1958 పనులను గుర్తించడం జరిగిందన్నారు.  వీటిలో ఇన్ఫ్రా, సేవలు, మానవ వనరులు చెందిన అంశాలు ఉన్నట్లు తెలిపారు. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధించిన పనులకు తక్షణం మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.  మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గుర్తించిన పనులకు చెంది మూడు కేటగిరీ లుగా విభజన చేయాలన్నారు. ప్రతి మండలం వారీగా సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తానని, వాటిపై కేటగిరీ వారీగా మండల అభివృద్ధి అధికారులు నివేదిక సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పై పేర్కొన్న పనులు ఉన్నట్లు గుర్తించినట్లు అయితే వాటిపై నివేదిక అంద చేయాలన్నారు. మండల పరిధిలోని గ్రామాల వారీగా, సచివాలయం వారీగా అంశాల ను కేటగిరీ విభజించి నివేదిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి సచివాలయానికి కేటాయించిన రూ.20 లక్షల నిధులతో జీజీఎంపి పనులను చేపట్టాలని, మేజర్ పనులకు చెంది ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.


65వ  సెంట్రల్ సాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ కింద నిర్దేశించిన 11,300 ఇళ్ళ లక్ష్యం కు గాను 9858  డేటా ఎంట్రీ 87 శాతం పూర్తి చేయడం జరిగిందని , 66 వ సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ కింద 5801 ఇళ్లకు గాను 5745(99%) డేటా ఎంట్రీ పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన డేటా పనులు శుక్రవారం పూర్తి చేస్తే, ప్రభుత్వానికి అందుకు అనుగుణంగా నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపుతామని కలెక్టర్ మాధవీలత అన్నారు. స్వంత ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ఆసక్తి కలిగిన 14134 మంది లబ్దిదారులలో  1060 మంది డేటా అప్డేట్ చెయ్యడం జరుగుందని, మిగిలిన వాటిని రాబోయే 48 గంటల్లో పూర్తి చేయాలన్నారు. లే అవుట్ ల వారీగా కరెంట్, విద్యుత్ సంబంధించి అన్ని పనులు పై నివేదిక అందజేయ్యాలని కలెక్టర్ పేర్కొన్నారు.

సర్వే మేరకు ప్రభుత్వం నేరుగా గుర్తించిన వాటిలో నగరపాలక సంస్థ పరిధిలో 289 ఆర్థికేతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయని మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్ తెలిపారు. ఇవి జీ జీ ఎం పి కింద గుర్తించిన అంశాలు కావని తెలియచేశారు. ఇంటి నిర్మాణ పనులకు అనుగుణంగా ఇటుకలు డిమాండ్ ఉన్నాయని, అందులో భాగంగా స్టేజ్ కన్వర్షన్ మేరకు ఇంటి పనులు కోసం సూక్ష్మ స్థాయి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతున్నట్లు వివరించారు.  ఈ సమావేశంలో ఇంఛార్జి జిల్లా హౌసింగ్ అధికారి జీ. పరశురామ్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యూ ఎస్ డి. బాల శంకర్ రావు, ఐ సి డి ఎస్ పిడి కె. విజయ కుమారి, డ్వామా పీడీ జీ ఎస్ రామ్ గోపాల్, డి హెచ్ వో వి రాధాకృష్ణ,  సిపివో కార్యాలయ ఏ వో కె. శ్రీనివాస రావు, , డిఎల్ డివో పి. వీణా దేవి, కే. శాంత మణి,  మైక్రో ఇరిగేషన్ ఎస్. రామ్ మోహన్, ఎంపిడివో లు, హౌసింగ్ ఏ ఈ లు, ఎలక్ట్రికల్ అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు