ఫిష్ ఆంధ్ర యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం ఆర్ధికంగా సహకారం అందిస్తున్నందున ఈ రంగం లో ఆసక్తి ఉన్న యువతను, మహిళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. వండిన చేపల కూరలు మార్కెటింగ్ చేయుటకు స్టాళ్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను, కూడళ్లను గుర్తించాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఫిష్, డైరీ డెవలప్మెంట్ యూనిట్ల లక్ష్యాల పై సమీక్షించారు. విద్యార్హత లు లేనందున ఆసక్తి వారికి అవగాహన కలిగించి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో యూనిట్లను ఏర్పాటు చేయించాలని తెలిపారు. ఎఫ్.పి.ఓ లు మండలాల్లో జరిగే జె.ఎం.ఎల్.బి.సి సమావేశాలకు తప్పక హాజరు కావాలని, అలా హాజరు కాని వారి పై చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ డి డి నిర్మలకుమారిని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ ఆర్ అండ్ ఆర్ కలోనిస్ లో డిగ్రీ పాస్ అయిన వారిని గుర్తించి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని ఆ శాఖ అధికారి గోవింద రావు కు సూచించారు.
పోలిపల్లి లో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చని అన్నారు. కానీలలో తిరిగి షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడ పెట్టాలి, ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు అనే అంశాలను డి.ఆర్.డి.ఏ, మెప్మా ల ద్వారా సర్వే చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్లను నెలకొల్పేలా చూడాలని ఆ శాఖ జె.డి డా.రమణకు తెలిపారు. కొత్తవలస లో నున్న. మాంగో జెల్లీ ని ఆకర్షణీయమైన పాకింగ్ చేయించి జి 20 సదస్సుకు సిద్ధం చేయాలని డి.ఆర్.డి.ఏ పి.డి కల్యాణ చక్రవర్తి కి సూచించారు. ఈ సమావేశంలో జె.సి మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు, ఫిషరీష్ డిడి ఎన్.నిర్మలకుమారి, ఎల్.డి.ఎం శ్రీనివాస రావు, మెప్మా పిడి సుధాకర రావు, హార్టికల్చర్ డిడి జమదగ్ని తదితరులు పాల్గొన్నారు.