ప్రభుత్వ ప్రాధాన్యత భవాలను సత్వరమే నిర్మించాలి


Ens Balu
6
Rajamahendravaram
2023-02-17 14:44:56

తూర్పుగోదావరి జిల్లాలో ప్రాధాన్యత భవనాలు, గృహ నిర్మాణాల అవసరాలకు అనుగుణంగా కొత్త ఇసుక రీచ్ లను  గుర్తించి ప్రతిపాదనలు అందచెయ్యలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, మార్చి 2 నాటికి పర్యావరణ అనుమతుల కాలపరిమితి ముగిసే సాండ్ రీచ్ లకు సంబంధించి ప్రతి పాదనలు ప్రభుత్వానికి సాంకేతిక అంశాలు ప్రాతిపదికన సిద్దం చెయ్యాలన్నారు. జిల్లాలోఐదు సాండ్ రీచేస్ లకు చెందిన స్టాక్ పాయింట్స్, డిపో ల వివరాలు కలెక్టర్ కు అందచేశారు. చిడిపి లో 10043 మెట్రిక్ టన్నుల, ఉసులుమర్రు లో 10,544 ఏంటి, పందల పర్రు లో 7,074 ఏమ్ టి, పెండ్యాల లో 13,218 ఎంటి, కాపవరం లో 6,490 ఎంటి ఇసుక అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ నిర్మాణాలకు వినియోగించాడానికి అవసరమైన ఇసుక లభ్యత లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక మేరకు సిద్దంగా ఉండాలన్నారు.

 ఉగాది నాటికి ఇళ్ళ నిర్మాణం పనులు వేగవంతం చేసే విధానం లో అడుగులు వేస్తున్న దృష్ట్యా, ప్రస్తుతం ఇంటి పనులకు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం లేనందున తగినంత ఇసుక లభ్యత ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం డివిజన్ వేమగిరి కడియాపులంక 4.57 హెక్టర్లలలో 45,700 క్యూబిక్ మీటర్ల కోసం క్షేత్ర స్థాయి తనిఖీ అనంతరం సమావేశం ముందు ఉంచిన ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది.  కాతేరు బోట్స్ మ్యాన్ సొసైటీ వారికి డీ సిల్టేషన్ కు సంబంధించి నాలుగు రిజిస్ట్రేషన్ సొసైటీ కు అనుమతులు మంజూరు చేయడం కోసం కమిటీ ఆమోదం తెలియచేసింది . ఇందుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని కమిటీ స్పష్టం చెయ్యడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. నియమ నిబంధనలు పాటించని వారి లైసెన్స్, లీజు కాల పరిమితిని రద్దు చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు.  

ఈ సమావేశంలో కాకినాడ డిడి మైన్స్ ఈ. నరసింహ రెడ్డి, రాజమహేంద్రవరం ఏ డీ ఎమ్. విష్ణు వర్ధన్,   ఆర్టీవో కేవి కృష్ణా రావు, ఈ ఈ పొల్యూషన్  జీ. కరుణ రేఖ, డి డి (గ్రౌండ్ వాటర్) వై. శ్రీనివాస్,    సి ఐ (సెబ్) కే. రాంబాబు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది పి వి రమణ,  జెపి ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.