స్మశాన వాటిక పనుల వేగం పెంచండి..


Ens Balu
4
Tirupati
2020-09-25 19:46:59

తిరుపతిలో స్మార్ట్ సిటీ నిధులతో దేవేంద్ర థియేటర్ రోడ్డు నందు హరిశ్చంద్ర స్మశాన వాటిక లో దహన క్రియలు కోసం జరుగుతున్న విద్యుత్ యంత్రాల ప్రక్రియ వేగం పెంచాలని కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు.  శుక్రవారం  కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులతో ఆ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ గిరీష మాట్లాడుతూ, నగరపాలక సంస్థ తరఫున దహన క్రియలు కోసం నిర్మిస్తున్న విద్యుత్ యంత్రాల ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని, నగరంలో సాధారణ మరణాలు, కోవిడ్ మరణాలు అధికమవుతున్న తరుణంలో  రోజుకి 50 నుంచి 60 మందికి దహన సంస్కారాలు  నిర్వహించే విద్యుత్ యంత్రాలను త్వరగా  అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం వినాయక సాగర్ లో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు ఫేస్ వన్ 11 కోట్ల36 లక్షల రూపాయలతో జరుగుతున్న పనులను ఇంజనీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్ తో కమీషనర్ గిరీష పరిశీలించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  ఎస్ఈ చంద్రశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ శంకర్ రెడ్డి, స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.