ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయి..


Ens Balu
5
తిరుపతి
2020-09-25 19:53:49

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అమృత వాటర్ పైప్ లైన్, యు డి ఎస్( భూగర్భ డ్రైనేజీ) పైప్ లైన్ అక్టోబర్ మొదటివారం లోపల పూర్తి చేయాలని కమిషర్ గిరీష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికి  కనెక్షన్లు ఇవ్వాలని వాటి ద్వారా నగరపాలక ఆదాయం సమకూర్చాలన్నారు. నేటి నుండి ప్రతి ఇంటింటికి వెళ్లి యు డి ఎస్( భూగర్భ డ్రైనేజీల) మరియు త్రాగునీరు కనెక్షన్ లేని వారందరికీ కొత్త కనెక్షన్లు ఇవ్వాలని, గతంలో తీసుకున్న కనెక్షన్లు పరిశీలించాలని, అక్రమ కనెక్షన్లు ఉంటే వాటిని తొలగించి వారికి అపరాధ విధించాలని మరియు నగర పాలక అందిస్తున్న సదుపాయాన్ని నిలిపేయాలని ఆదేశించారు. నగరంలో ఉన్న వాటర్ ట్యాంకులు నిర్మాణ పనులు వారంలో పూర్తవ్వాలని, అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డులలో భూగర్భ డ్రైనేజీ, తెలుగు గంగ త్రాగునీరు కనెక్షన్ ఇవ్వాలని వాటి ద్వారా నగరపాలక కోట్లలో ఆదాయం వస్తుందని ఆలస్యం చేయకుండా పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ మొదటివారం  లోపల అమృత్ స్కీమ్ ద్వారా జరుగుతున్న పైప్లైన్ పనులన్నీ పూర్తవ్వాలని ఆలస్యం చేస్తే బిల్లులు మంజూరు చేయనని కాంట్రాక్టర్లు ఆదేశించారు.  ఈ సమీక్ష సమావేశంలో ఎస్ఈ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రాంరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘు కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, దేవిక, అసిస్టెంట్ ఇంజినీర్ శంకర్ రెడ్డి, ఏక్నాథ్, అమృత స్కీం కాంట్రాక్టర్లు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.