శ్రీ పళ్లికొండేశ్వర స్వామివారికి టిటిడి పట్టువస్త్రాల సమర్పణ


Ens Balu
7
Surutapalli Anicut
2023-02-18 11:41:56

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రమైన సురుటుపల్లిలోని శ్రీ పళ్లికొండేశ్వర స్వామి వారికి టిటిడి తరఫున శనివారం పట్టు వస్త్రాలు సమర్పించారు.  టిటిడి ఛైర్మన్ సతీమణి స్వర్ణలతారెడ్డి, శ్రీవారి ఆలయ పారుపత్తేదార్  ఉమామహేశ్వర్ రెడ్డి, వేదపారాయణదారులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి టిటిడి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే  కోనేటి ఆదిమూలం, ఆలయ పాలకమండలి ఛైర్మన్  బాలాజిరెడ్డి, ఈవో  రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు