విజయనగరం స్పందనకు 112 వినతులు
Ens Balu
18
Vizianagaram
2023-02-20 10:24:13
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన స్పందన (జగనన్నకి చెబుదాం) వినతుల కార్యక్రమానికి వివిధ సమస్యలకు సంబంధించిన 112 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 78 ఫిర్యాదులు వచ్చాయి. డీపీవోకు 10, డీఆర్డీఏ, గృహ నిర్మాణ శాఖలకు చెరో ఏడేసి ఫిర్యాదులు రాగా ఈపీడీసీఎల్ కు 5, మున్సిపాలిటీకి 3, డీఎం &హెచ్‌వోకు, సచివాలయ విభాగానికి చెరో ఒకటి వచ్చాయి. ప్రజల నుంచి వినతులపై సత్వరమే స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో పాటు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో ఎం. గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు సుదర్శనదొర, సూర్యనారాయణలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ విభాగాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.