జాతీయ విద్యావిధానంపై అవగాహన అవసరం..
Ens Balu
3
Vizianagaram
2020-09-25 20:28:14
నూతన జాతీయ విద్యావిదానంపై ఆంధ్రప్రదేశ్ అఖిలభారతవిద్యాపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ లో విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నూతన విద్యావిధాన డ్రాఫ్ట్ కమిటీ మెంబెర్ ప్రొఫెసర్ టివి కట్టిమని కీలక ప్రసంగం చేశారు. నేటి యువతరానికి మన జాతీయ ఔ న్నత్యాన్ని తెలుయజేసే విధంగా నూతనవిద్యావిధానాన్ని రూపొందించడం జరిగిందని, విద్యార్థుల్లో క్రియాశీలకసక్తిని పెంపొందించి నైపుణ్యాలను కలిగించి జీవనోపాధికి దోహదపడే విధంగా రూపొందించబడిందని అన్నారు. మన జాతీయవనరులు నదులు, సముద్రాలు, వృక్ష సంపద, జంతుసంపద మొదలగు వాటి సంప్రదాయ ఆర్థికవిలువలు తెలియజేసి వాటిని పరిరక్షిస్తూ సంపద వృధ్ధి దిశగా విద్యావిధానం రూపొందించబడిందని అన్నారు. నూతన విధానం విజయవంతం కావాలంటే ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీటీయూ ప్రతీక అధికారి ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి, డాక్టర్ ఎన్ వి ఎస్ సూర్యనారాయణ,సీటీయూ విద్యార్థులు చరణ్ గుప్తా, మోహన్, రాష్ట్ర ఎబివిపి నాయకులు, అనేకమంది టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.