పోలీస్ గ్రీవీవెన్స్ దరఖాస్తులకు తక్షణ పరిష్కారం
Ens Balu
18
Visakhapatnam
2023-02-21 09:05:26
విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ ద్వారా అందే దరఖాస్తులను సంబంధిత విభాగాల అధికారులు తక్షణమే పరిష్కరించాలని సిపి పిహెచ్ శ్రీంత్ అదేశించారు. మంగళవారం సిపి కార్యాలయంలో జూమ్ ద్వారా పోలీస్ గ్రీవెన్స్ ను నిర్వహించారు. ఈసందర్భంగా సిబ్బంది నుంచి తొమ్మిది వినతలు అందాయి. వాటిని సంబంధిత విభాగాలకు సిపి బదిలీచేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ, నగర పరిధిలోని అన్నిస్టేషన్లు, సర్కిళ్లులోని సిబ్బంది పోలీస్ గ్రీవియన్స్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. శాఖపరమైన సమస్యలను, రాష్ట్రపరిధిలోని సమస్యలను నేరుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిపీ, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల సిబ్బంది జూమ్ లో పాల్గొన్నారు.