డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా జోన్ పరిధిలో నూతనంగా ఇ -ఫిస్ సర్వేలో ప్రతిపాదించిన 3,878 హెక్టార్ల విస్తీర్ణానికి జిల్లాస్థాయి ఆక్వా కల్చర్ జిల్లా సమన్వయ కమిటీ ఆమోదం తెలిపినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ లో ఆక్వా కల్చర్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం కమిటీ సభ్యులతో చైర్మన్ , జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 2018 సంవత్సరంలో దశలవారీగా నిర్వహించిన ఆక్వా జోనేషన్ సర్వే పైన, జిల్లాలో ఇ- ఫిష్ సర్వే , విద్యుత్ కనెక్షన్ల సబ్సిడీ స్థితిపైన, ఆక్వా జోన్ డిక్లరేషన్ కింద కొత్తగా అనువైన ప్రాంతాన్ని గుర్తిం చడం కోసం నిర్వహించిన రీసర్వే, గ్రామ సభల పైన, రెండో దశ కింద వినియోగదారుల విద్యుత్ కనె క్షన్‌లు, ఇతర అర్హత గల ప్రాంతాలకు సంబంధించి ఆక్వా జోన్ ప్రాంతాన్ని సుస్థిర ఆక్వా జోన్ మ్యాపింగ్‌గా మార్చడానికి ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు పై సమీక్షించి నూతన ప్రతిపాదన లను కమిటీ సభ్యుల ఆమోదంతో ఆక్వా జోన్ కింద ధ్రువీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పాత విస్తీర్ణం తో కలిపి, జిల్లా వ్యాప్తంగా 15, 928 హెక్టార్ల మేర ఆక్వా జోన్ పరిధిలోకి రానున్నట్లు చెప్పారు. 2018 నాటి సర్వే ప్రకారం జిల్లాలో 12 వేల 160 హెక్టార్ల విస్తీర్ణం మేర ఆక్వా జోన్ ఉందని ప్రస్తుతం నూతనంగా 3,878 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఒక గ్రామంలో 60 శాతం విస్తీర్ణంలో ఆక్వా సాగు ఉన్నట్లయితే ఆ గ్రామం ఆటోమేటిక్ గా ఆక్వా జోన్ పరిధి లోకి వస్తుందన్నారు. మండలాల వారిగా రావులపాలెం మండలం, రాయవరం, మండపేట కే గంగవరం రామచంద్రపురం, మండపేట ఆలమూరు ,కపిలేశ్వరపురం మినహా మిగిలిన మండలాల్లో ఆక్వా జోనేషన్ ఎంత మేర విస్తీర్ణంలో నూతనంగా ప్రతిపా దించింది ఆయన శాతాలవారీగా అధికారులతో సమీక్షించారు. ఉప్ప లగుప్తం, అల్లవరం, ఐ పోలవరం మండలాల్లో నూతనంగా ఎక్కువ మేర విస్తీర్ణం పెరిగిందని తెలిపారు.
జిల్లాలో ఆక్వా విద్యుత్ కనెక్షన్లు 5,862 ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ మరియు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మహమ్మద్ కమిటీ సభ్యులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే నాగేశ్వరరావు లీడ్ బ్యాంకు మేనేజర్ లక్ష్మీపతిరావు డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్ భూగర్భ జల శాఖ డిడి రాధాకృష్ణ, ట్రాన్స్కో ఈ ఈ రవికుమార్, జల వనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ డివి రామగోపాల్, పరిశ్ర మల శాఖ ఏడి శివరాం ప్రసాద్ కమిటీ సభ్యులు ఎన్ సూర్యనా రాయణ రాజు వి రాంబాబు, మత్స్యశాఖ ఎఫ్ డి ఓ లు సిబ్బం ది,అభ్యుదయ ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు.