భూసేకరణ వేగవంతం చేయాలి..


Ens Balu
4
Vizianagaram
2020-09-25 20:33:01

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తోటపల్లి, తారకరామ, వెంగళరాయ సాగర్ తదితర ఇరిగేషన్ ప్రాజక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చెయ్యాలని సంయుక్త కలక్టరు డా. జి.సి . కిషోర్ కుమార్ ఆదేశించారు.  శుక్రవారం కలక్టరేట్ ఆడిటోరియంలో ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో భూసేకరణ పనులపై సమీక్షించారు.  భూసేకరణ పూర్తయిన వెంటనే వాటికి అవార్డును పాస్ చేసి భూమిని అప్పగించాలని ఆదేశించారు.  అవార్డు కోసం సిద్ధంగా ఉన్న భూముల వివరాలను రేపటికల్లా అందజేయాలన్నారు.  పరిహారానికి సంబంధించిన బిల్లులను వెంటనే అప్ లోడ్ చేయాలని, చెల్లింపులు త్వరగా జరగాలన్నారు.  చెల్లించవలసిన గత బకాయిలు రూ.18 కోట్ల వరకు ఉన్నాయని, వాటి వివరాలు వెంటనే అందజేయాలని, చెల్లింపుల కోసం ప్రభుత్వంతో మాట్లాడటం జరుగుతుందన్నారు.  రెవిన్యూ అధికారులు భూసేకరణపై  కేసులు, దేవాదాయ భూములు, పిటిషన్లు  , ప్రభుత్వ భూములు తదితర అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు.   ఈ సమావేశంలో విజయనగరం ఆర్డిఓ బిహెచ్. భవానిశంకర్,  ఇరిగేషన్ ఇఇ రామచంద్ర, ప్రత్యేక ఉప కలక్టర్లు బాల త్రిపుర సుందరి, వెంకటేశ్వర్లు, సాల్మన్ రాజ్, తహశీల్దార్లు, ఇరిగేషన్ డిఇలు తదితరులు పాల్గొన్నారు.                         అంత‌కుముందు డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో 6,85,000 మందికి బియ్యం కార్డులు మంజూరు కాగా,  ఇప్ప‌టికే వీరిలో సుమారు 5,85,000 మందికి కార్డుల పంపిణీ పూర్తి చేయ‌డం జ‌రిగింద‌న్నారు. రైస్ కార్డు ఉన్న‌వారంద‌రికీ వైఎస్ఆర్ బీమా ప‌థ‌కాన్ని వ‌ర్తిస్తుంద‌న్నారు. బ్యాంకు ఖాతాలు తెరవ‌డంలో, బ్యాంక‌ర్ల‌నుంచి ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. జ‌న్‌ధ‌న్ ఖాతాలు తెరిచేందుకు కొన్ని బ్యాంకులు అంగీక‌రించ‌డం లేద‌ని చెప్పారు. ఖాతాల‌ను తెరిచేందుకు  వెలుగు సిబ్బంది పూర్తిగా స‌హ‌క‌రిస్తార‌ని, ధ‌ర‌ఖాస్తుల‌ను పూర్తిగా నింపి, బ్యాంకుల‌కు తీసుకువ‌స్తార‌ని చెప్పారు. అలాగే బ్యాంకు బిజినెస్ క‌ర‌స్పాండెంట్లు,  బీమా మిత్ర‌ల సేవ‌ల‌ను కూడా వినియోగించుకోవాల‌ని సూచించారు.  మెప్మా పిడి కోట్ల సుగుణాక‌ర‌రావు మాట్లాడుతూ బ్యాంకుల ప‌రంగా ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను వివ‌రించారు. చిరువ్యాపారుల‌ను ప్రోత్స‌హించేందుకు పిఎం స్వ‌నిధి ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంద‌ని, దీనిక్రింద రూ.10వేలు రుణాన్ని ఇస్తోంద‌ని తెలిపారు. ఈ ప‌థ‌కం విజ‌య‌వంతం చేసేందుకు బ్యాంకులు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, వివిధ బ్యాంకుల మేనేజ‌ర్లు పాల్గొన్నారు.