ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విశాఖపట్నం-విజయనగరం- శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి బుధవారం పన్నెం డు (12) మంది జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. విజయనగరం జిల్లా రాజాంకి చెందిన పురిపండ శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. విశాఖకు చెందిన పివీఎన్ మాధవ్ బిజేపీ అభ్యర్థిగా 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. విశాఖపట్నం జిల్లా సిబిఎం కాంపౌండ్ కు చెందిన గుండుపల్లి సతీష్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. విశాఖపట్నం జిల్లా వేపగుంట కు చెందిన దండేల ఆనందరావు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన కాళ్ల లోకనాథం స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. విశాఖపట్నం జిల్లా పెదవాల్టేరు కు చెందిన వేపాడ చిరంజీవిరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. విశాఖపట్నం జిల్లా ఆర్కే బీచ్ కు చెందిన సీతంరాజు సుధాకర్ వైఎస్సార్సిపి పార్టీ అభ్యర్థిగా మూడు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.
అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేటకు చెందిన ఈర్లే శ్రీరామమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు . అనకాపల్లి జిల్లా గవరపాలెం చెందిన ఆడారి శరత్ చంద్ర స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు . విశాఖపట్నం ఆరిలోవ కు చెందిన బలివాడ రామ సంతోష్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి కి చెందిన రాజాన మోహన్ రావు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు . విశాఖపట్నం జిల్లా మధురవాడ కు చెందిన గ్రిద్దలురు విజయ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ రాగా బుధవారం (ఫిబ్రవరి 22) నాటికి మొత్తం పద్దెనిమిది (18) మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.