ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గ ఎన్నికల పోటీకి ఒక నామినేషన్ దాఖలు అయింది. డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, సూర్యనగర్, ఇంటి నెంబరు 5-4-24 నివాసి కుడుపూడి సూర్యనారాయణ రావు, వయస్సు 73 ఏళ్లు, తండ్రి గోపాలకృష్ణ గోఖలే, మంగళవారం మద్యాహ్నం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టి అభ్యర్థిగా తమ నామినేషన్ పత్రాలను, 10 మంది ప్రోపోజర్ల సంతకాలతో రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దాడిశెట్టి రాజా, వేణుగోపాల క్రిష్ణ, కాకినాడ అర్భన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఇతర వైఎస్సార్సీపి నాయకులు పాల్గొన్నారు.