జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవారధులని సత్యాన్వేషణతోనే జర్నలిస్టులకు మంచి గుర్తింపు వస్తుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(APUWJ)డైరీ ని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సిహెచ్ బిఎల్.స్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంబాబు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ లకో కూడి బ్రుందం కలెక్టర్ తో కలిసి యూనియన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాస్తవాలు వార్తలుగా వచ్చినపుడు మాత్రమే మీడియా అంటే ప్రజలకు గౌరవం వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జగదీష్, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శేఖర్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు మల్ల భాస్కరరావు, ప్రసాద్ బాబు, వెలగా రమణ,మోహన్ బాబు,ఏడి బాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.