అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ గౌతమీ శాలి పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం నెలవారి నేరసమీక్ష సమావేశంలో ఆమె పలుసూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరిమానాలు వసూలు చేయాలన్నారు. ముఖ్యంగా గంజాయి కేసులలో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టులు చేయాల న్నారు. గంజాయి నిర్మూలనకు ఆయా కేసుల్లో బెయిల్ పై ఉన్న నిందితులు ,శిక్ష అనుభవించి జైలు నుండి రిలీజ్ అయిన వారిపై ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తీవ్రమైన, సాధారణ పెండింగ్ కేసులు, ముఖ్యంగా గంజాయి, ఆస్తి దొంగతనాల కేసులు దర్యాప్తును సమీక్షించారు. విశాఖపట్నం పి.డి.జె. కోర్టు స్పెషల్ పీపీ వై.తారక రామారావు పోలీసు అధికారులు విధినిర్వహణలో అరెస్టులు చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, 41ఎ నోటీసు, 448 ఎ ఆర్డర్ పై అవగాహన కల్పించారు.