పశ్చిమగోదావరి జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ కు రేషన్ కార్డులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్స్ సంక్షేమకేమానికి అధికారులు కృషి చేయాలని, ముఖ్యంగా వారికి రేషన్ కార్డులు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఆరుగొలను, ఎల్.బి చర్ల, ఆరుగొలను న్యూ, ఆచంట సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను మంచి మార్కులు పొందేందుకు ప్రోత్సహించాలన్నారు. జిల్లా అధికారులు వీరిని ప్రోత్సహించేందుకు సందర్శనకు రానున్నట్లు తెలిపారు.
తణుకు, నరసాపురం చర్చ్ ల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మైనార్టీ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలను సచివాలయాల్లోనే సంక్షేమ కార్యదర్శిల ద్వారా ప్రజలోనికి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ జిల్లా జాయింట్ ఎం.సూర్య తేజ, భీమవరం ఆర్దిఓ దాసిరాజు, బిసి కార్పొరేషన్ ఈడీ పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.కుమిదిని, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిస్టిక్ కోఆర్డినేటర్ పి.వాసవి, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి నీలకంఠ ప్రధాన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు గణపతి రావు, శోభారాణి, డి.పుష్పరాణి, తదితరులు పాల్గొన్నారు.