జి-20 సదస్సుకు ఇరవై దేశాల ప్రథినిధులు రానున్న నేపథ్యంలో సదస్సులు జరిగే సమయంలో పారిశుధ్య కార్మికులను ఆయా ప్రాంతాలలో వుంచి రోడ్డును నిరంతరం శుభ్రంగా వుంచే విధంగా చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పి రాజాబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విశాఖ ఎన్ఏడి జంక్షన్ నుండి మురళి నగర్ జంక్షన్ జాతీయ రహదారి వరకు పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతాలను తెలిపే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి సుందరీకరణ పనులు క్షున్నంగా పరిశీలించేందుకు నడక మార్గంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టామన్నారు. రహదారికి ఇరువైపులా, సెంట్రల్ మీడియంలోను పారిశుధ్య కార్మీకులచే శుభ్రం చేయించాలని, చెట్లు, ఎలెక్ట్రికల్ పోల్సు, గోడలకు ఉన్న ప్రకటనల బోర్డులు, కేబుల్ వైర్లు, పోస్టర్లను తొలగించి శుభ్రం చేయాలన్నారు.అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు పాల్గొన్నారు.