48 గ్రామాల్లో భూమి రీసర్వే సత్వరం పూర్తిచేయాలి


Ens Balu
24
Amalapuram
2023-02-23 15:37:41

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2వ దశ లో కేటాయించిన 48 గ్రామాలలో భూముల రీ సర్వేకి సంబందించి గ్రౌండ్ ట్రుతింగ్ ప్రక్రియ మార్చి 15 నాటికి పూర్తి పూర్తిచే యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర సంబంధిత అధికారులు ఆదేశించారు.  గురువారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి సాయి ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ లు అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్లు ,జాయింట్ కలెక్టర్లతో నిర్వహించి వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష రీ సర్వే లోని పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  రీసర్వేకి సంబంధించి గ్రౌండ్ ట్రు తింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్,13 నోటిఫికేషన్, 9(2) నోటిఫికేషన్ జారీ, రెవిన్యూ రికార్డుల స్వచ్ఛీ కరణ, డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్, వెక్టర్లెజేషన్, గ్రామ సర్వేయర్ విఆర్వో లాగిన్ లలో డేటా ఎంట్రీ, రోజువారీగా రోవర్స్ వినియోగం, సరిహద్దు పాయింట్లు గుర్తింపు, సరిహద్దు రాళ్లు ఏర్పా టు ఇత్యాది అంశాల పురోగతిపై సమీక్షించారు.

 ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సర్వేటీంలను, సర్వే మరియు రెవెన్యూ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ రీ సర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని ప్రక్రియలు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జరిగేలా అదికారులు, సిబ్బంది నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. భూ యజమానుల రికార్డుల తయారీ తప్పులు లేకుండా సిద్ధం చేయా లన్నారు. స్వామిత్ర పథకం ద్వారా జరుగుతున్న గ్రామ కంఠాల సర్వేని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొదటి దశ రి సర్వేలో 66 గ్రామా లలో 43 గ్రామాలకు సంబంధించి భూ హక్కు పత్రాలు పంపిణీ చేయ డం జరిగిందన్నారు. మిగిలిన గ్రామా లు పురోగతిలో ఉన్నాయన్నారు. రెండోదశకి సంబంధించి 49 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని వీటిలో 48 గ్రామాలలో సర్వే ప్రారంభమైందని  తెలిపారు. ఒక గ్రామానికి సంబంధించి రికా ర్డులు అందుబాటులో లేనందున జాప్యం జరుగుతోందని ఆయన వెల్లడించారు. మొత్తం రెండు దశల లో 115 గ్రామాలు ఎంపిక చేయగా కోనసీమ జిల్లాలో ఉన్న మొత్తం 315 గ్రామాల్లో ఇంకా 200 గ్రామాలకు ఆర్థోరేక్టిఫై మ్యాపులు రావాల్సిందని ఆయన తెలిపారు. 

సర్వే పూర్తయిన గ్రామాలలో ఏ క్లాస్ బి క్లాస్ సరిహద్దురాళ్లు ఏర్పాటుకు సంబంధించి 1,19,742 రాళ్లు అవసరం ఉండగా 69,180 సరిహద్దు రాళ్లు సరఫరా చేయడం జరిగిందన్నారు. రోజువారీగా 7,865 సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతోoదని ఆయన తెలిపారు. సరిహద్దురాళ్లు అంతర్గత రవాణా ఏర్పాట్లు స్థానికం గా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచిం చారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం రోజువారీగా రోవర్స్ ద్వారా పాయిం ట్లు గుర్తించాలని సూచిం చారు. సరిహద్దు రాళ్లు ఏర్పాటుకు సంబం ధించి మార్కింగ్, ఫిట్టింగ్ ప్రక్రియ లలో రైతుల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేప ట్టాలన్నారు. రెవెన్యూ సిబ్బంది ముటేషన్లు, క్లాసిఫికేషన్లు చేపట్టాల ని సూచించారు. ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్ సహాయ సంచాలకులు సర్వే బృందాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచిం చారు.  ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు  గోపాలకృష్ణ లంక భూములు సర్వేయర్ ప్రసాదు, సెక్షన్ సూపరింటెండెంట్, రమణకుమారి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు