విశాఖలో మార్చి 3, 4 తేదీలలో జిల్లాలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వస్ట్మెంట్ సదస్సుకు సంబందించి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం గ్లోబల్ ఇన్వస్ట్మెంట్ సదస్సు నిర్వహించే ఆంధ్రాయూనివర్సిటి గ్రౌండును నగర పోలీసు కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ పి.రాజాబాబులతో కలిసి జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిద దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరౌతారని, వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం స్థానిక ఉడా పార్కు ప్రక్కన గల ఎం .జి.ఎం పార్కును అక్కడ జరుగుతున్న పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, జి.వి.ఎం .సి, అధికారులు పాల్గొన్నారు.