కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు పక్కగా ఏర్పాట్లు చేయాలి


Ens Balu
18
Visakhapatnam
2023-02-23 16:25:41

కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న పలు  పోటీ పరీక్షలకు  పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు  కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈనెల 25, 26  తేదీలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  SWAYAM జులై -2022 సెమిస్టరు పరీక్షలు, తేది . 26.02.2023 న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించు జూనియర్ ఇంజనీర్ , తేది. 02.03.2023 నుండి 07.03.2023 వరకు జరుగు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. అభ్యర్థులు, రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు గైడ్ లైన్స్ తు.చా తప్పకుండా పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. 

ప్రశ్నాపత్రాలు చేరవేత మొదలుకొని పరీక్ష పూర్తయ్యాక బండిల్స్ ను చేరవేసే వరకు నిబంధనలను అనుసరించి పనిచేయాలని లైజనింగ్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్ లకు ఆయన సూచించారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్లు,  క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచెస్, ఇతర స్మార్ట్ పరికరాలను తీసుకురాకూడదని ఆయన చెప్పారు.  విద్యార్థులు వారి పరీక్ష సమయం కంటే అరగంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు.పరీక్ష నిర్వహించబడు రోజున  విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని , త్రాగు నీరు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.  ఈ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు . ఈ పరీక్షకు ఎలాంటి లోపాలు తలెత్తకుండా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ ఎస్ సి అధికారులు, జీవిఎంసి, పోలీస్, మెడికల్, ఈపిడిసిఎల్ వివిధ కాలేజీ ల లైజనింగ్ ఆఫీసర్లు, రెవెన్యూ సంబంధిత  శాఖల అధికారులు పాల్గొన్నారు.

సిఫార్సు