అవినీతి రికార్డు అసిస్టెంటు అనిల్ ను ఇంటికి పంపాం


Ens Balu
15
Annavaram
2023-02-25 15:42:11

అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం వ్రత టిక్కెట్ల అమ్మకాల్లో గోల్ మాల్ చేసిన అవినీతి రికార్డు అసిస్టెంట్ టి.అనిల్ కుమార్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్టు ఈఓ మూర్తి తెలియజేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఈఎన్ఎస్ ప్రతినిధితో చరవాణిలో మాట్లాడారు. వ్రతటిక్కె ట్లలో(రూ.800) జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి, ఆనివేదికను కమిషనర్ కు పంపామని చెప్పారు. దీనితో ఆయన ఆదేశాల మేరకు సదరు ఉద్యోగిపై వేటు వేసినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా దేవస్థానంలో ఏ విభాగంలో అవినీతి జరిగినా సహించేది లేదని, ఏ స్థాయి ఉద్యోగిపైనైనా అవినీతి ఆరోపణలు, లిఖిత పూర్వక ఫిర్యా దులు వస్తే తక్షణమే విచారణచేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవస్థానంలోని అన్ని విభాగాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మీడియా ద్రుష్టికి అవినీతి వ్యవహారాలు నేరుగా తనకు తెలియజేవచ్చునని స్పష్టం చేశారు.

సిఫార్సు