విశ్వనాధ్, వాణీజయరాం సేవలు చిరస్మరణీయం


Ens Balu
18
Visakhapatnam
2023-02-25 16:19:09

తెలుగునాట కళాతపస్వీ కె.విశ్వనాధ్, వాణిజయరాం అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. తెలుగు చలనచిత్ర రంగం ద్వారా ప్రజల గుండెల్లో వారు శాశ్వతంగా గుర్తిండిపోతారన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కె.విశ్వనాధ్, వాణిజయరామ్ ల పేరిట స్వరనీరాజనం కార్యక్రమం నిర్వహించారు. పైడా విద్యాసం స్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దాడి సత్యనారాయణ,  సినీనటుడు ప్రస న్నకుమార్, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, మహ్మద్ ఖాన్, యాద్ కుమార్, రవితేజ, సంఘం కార్యదర్శి కృష్ణ కిషోర్ తదితరులంతా విశ్వనాద్, వాణిజయరాంల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియే షన్ కార్యదర్శి కిషోర్, ఆర్గనైజర్ అప్పారావు, విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జనార్ధన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివజ్యోతి, రాథో గణేష్ , రమేష్ తో పాటు పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు.

సిఫార్సు