ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓటమి భయంతో దిగజారుడు పద్ధతులు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతు న్నదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి, ఎ.అజ శర్మ ఆరోపించారు. ఆదివారం విశాఖలోని ఆయన మీడియాతో మాట్లాడారు. 250 కు పైగా ప్రజా సంఘాల మద్దత్తుతో, పిడిఎఫ్ అభ్యర్ధిగా డాక్టర్ కోరెడ్ల రమాప్రభ పోటీ చేస్తున్నారని.. అయితే అదే పేరు గల వేరే అభ్యర్ధితో వైసిపి ఆఖరి రోజున నామినేషన్ వేయించిందని అన్నారు. ఓటర్లను గందరగోళ పరచడానికే ఈ విధం చేయడం అధికారపార్టీ దిగజారుడు చర్యకు నిరదర్శనమన్నారు. ఇటీవలే ఏయూ వీసి అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలతో దశపల్లా హోటల్ లో సమావేశం నిర్వహిం చి ఓటర్లను ప్రలోభపెట్టారన్న..వీరి కుతంత్రాలను తిప్పికొట్టి, వివేకవంతులయిన ఉత్తరాంధ్ర పట్టభద్రులు, మన ప్రాంత ప్రజల వాణిని చట్ట సభలో సమర్ధవంతంగా వినిపించగలిగే డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలన్నారు.