కేంద్ర ప్రభుత్వ నోటరీ గా సీనియర్ న్యాయవాది ఇమంది కూర్మారావును కొనసాగిస్తూ భారత న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ గోపాలపట్నం కు చెందిన కూర్మారావు 1994 లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. సివిల్,క్రిమినల్ కేసులు వాదించడంలో పేరు సంపాదించారు. న్యాయవాదిగా మంచి దిట్ట. విశాఖ బార్ అసోసియేషన్ కోశాధికారిగా గతంలో సేవలందించారు. 2008 నుంచీ కూర్మారావు కేంద్ర ప్రభుత్వ నోటరీ గా కొనసాగుతూ వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నాటికి 15 ఏళ్ల పాటు నోటరీ గా ఉండగా, తాజాగా, ఆయనకు మరో అయిదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ నోటరీ గా అధికారం కొనసాగిస్తూ భారత న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ నోటరీ కి గొప్ప విలువ ఉంటుంది. కుర్మారావు అటెస్టింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. క్లాసిఫైడ్ గెజిటెడ్ హోదా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓత్ (OATH) కమిషనర్ హోదా కూడా ఉంటుంది. ఇలా మరో ఐదేళ్ల పాటు కేంద్ర నోటరీ వుంటుంది.