చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. చిరుధాన్యాల ఆహార పండుగ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశమందిరం వద్ద చిరుధాన్యాల ఆహార ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తూ దారులకు, జిల్లా అధికారులకు చిరుధాన్యాలతో తయారు చేసిన జావను అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో చిరుధాన్యాల ప్రాధాన్యత మరింత పెరుగుతుందన్నారు. చిరుధాన్యాలలో పోషకాలను గుర్తించి అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంగా ప్రకటించడం అభినందనీయమన్నారు. చిరు ధాన్యాలలో లభించే పోషకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. వాటి విలువను ప్రజలకు వివరించాడనికే ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.