విశాఖ వేధికగా మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు అభివ్రుద్ధితో మారిపోనున్నాయ ని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని మద్దెలపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లా డారు. జి-20 సదస్సుల వలన పెట్టుబడులు రావడంతోపాటు, ఎంఎస్ఎంఈలు మరింతగా అభివ్రుద్ధి చెందుతాయన్నారు. టిడిపి రాజకీయ లబ్దికోసం జి-20 సదస్సులపై బురదచల్లే కార్యక్రమం చేస్తుందని.. కానీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా వచ్చే పెట్టుబడులు చూసి అదే పార్టీ నోరెళ్లబెడుతుందన్నారు. అంతేకాకుండా త్వరలోనే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి విశాఖనుంచే పరిపాలన చేయనున్నారని చెప్పా రు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యాచరణతో ముం దుకి వెళుతుందని చెప్పారు. కార్యక్రమంలో మహిళా నేత పేడాడ రమణికుమారి, వైఎస్సార్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.