ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి


Ens Balu
17
Visakhapatnam
2023-02-27 13:29:25

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలని శాసన మండలి ఎన్నికల పరిశీలకులు సిద్దార్థ్ జైన్ సూక్ష్మ పరిశీలకులకు చెప్పారు.  విఎంఆ ర్డ్ఎ చిల్డ్రన్స్ ఎరీనాలో పట్టబధ్రుల శాసన మండలి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి సూక్ష్మ పరిశీలకుల శిక్షణలో ఆయన పాల్గొన్నా రు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి నియమ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు.   48 గంటలు ముందు ప్రచారం ముగించాల్సి ఉంటుందన్నారు.  పోలింగ్ ఎలా జరుగుతోందో పరిశీలించాలని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ ఏ విధంగా చేస్తున్నది  సూక్ష్మ పరిశీలకులు పరిశీలించాలన్నారు. వెబ్ కాస్టింగ్, ఫొటోగ్రఫీలను పరిశీలించాలని తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్, ఫొటోగ్రఫీ ఉంటుందన్నారు.  సూక్ష్మ పరిశీలకులు చేయాల్సిన విధులపై సూక్ష్మ పరిశీలకులను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. 

పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజంట్లు, ఓటరు మాత్రమే ఉండాలన్నారు. ఓటరు విభిన్న ప్రతిభా వంతులైతే ప్రైసైడింగ్ ఆఫీసర్ అనుమతితోనే  “అటెండెంటు” రావాలని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ప్రలోభాలు జరుగకుండా చూడాలని తెలిపారు.  పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల ఎవరు ఉండకుండా ఎన్నికల నియమావళి తప్పక పాటించాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవాలని చెప్పారు. పోలింగ్ ముగిసిన సమయానికి ఎంత మంది వరుసలో ఉన్నది చూసుకుని ప్రెసైడింగ్ ఆఫీసర్ టోకెన్లు అందజేస్తారన్నారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల నియమావళిని అమలు చేయాలని చెప్పారు. సూక్ష్మ పరిశీలకుల నుండి సందేహాలును ఆయన నివృత్తి చేశారు. పలు సూచనలు తెలియజేశారు. 
సిఫార్సు