విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు నిత్యం చదవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ ఫిల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ పరావస్తు నాగసాయి సూరి అన్నారు. పీఎంపీ అసోసియేషన్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చైతన్యపురిలోని సుస్మిత నర్సింగ్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఎందరో వైద్య సిబ్బంది ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించారని, అందులో కొందరు చనిపోవడం ఆవేదన కలిగించిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వైద్య, పారామెడికల్ సిబ్బంది ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఆయన కొనిడారు. నారాయణ దంత వైద్యశాల హెచ్ఓడి డాక్టర్ నటరాజన్ కన్నన్ కి ఇటీవల మలేషియా లోని లింకన్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్, డాక్టరేట్ అందుకున్న శుభసందర్భముగా ఘనంగా సత్కరించారు. పీఎంపీ గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాష్,తదితరులు పాల్గొన్నారు.