రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని 21వ వార్డు ఫోటో ఓటర్ల జాబితా సిద్ధం చేశామని జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జివిఎంసీలోని 3వ జోన్ పరిధిలోని 21వ వార్డుకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో 3వ జోన్ కార్యాలయం, ఆర్డిఓ కార్యాలయం,తహసిల్దార్ కార్యా లయం, పోస్ట్ ఆఫీసులలో ప్రజల పరిశీలన కొరకు నోటీస్ బోర్డులో ఉంచామన్నారు. అలాగే రాజ కీయ పార్టీలకు వార్డు ఫోటో ఓటర్ల జాబితా కాపీని పంపించినట్టు పేర్కొన్నారు.