విజయనగరం జిల్లాలో రబీ 2022-23 లో మినుములు,పెసలు పండించిన రైతుల నుండి ప్రభుత్వ మద్ధతు ధర (మినుములు Rs.6600/-, పెసలు Rs.7755/-) క్వింటాకు కొనుగోలు చేయుటకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చిందని మార్కుఫెడ్ జిల్లా మేనేజర్ విమల తెలిపారు. ఈ-క్రాప్, సీఎం యాప్ నందు నమోదు చేయించుకున్న వారి నుంచి మాత్రమే కొనుగోలు చేస్తామని తెలియజేశారు. కొనుగోలు కింద్రాలు గంట్యాడ మండలంలో వసాది ఆర్.బి.కే నందు నందు 27.02.2023 తేదీన సోమవారం అధికారులు కోనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. అలాగే జిల్లాలో అన్నీ మండలాల్లో ఆర్.బి.కే ల నందు ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు. రైతులు వారి పంటను జల్లించుకుని కొనుగోలు కింద్రాల వద్ధకు నిర్దేశిక ప్రమాణాలు ఉండే విధంగా తీసుకురావాలని తెలిపారు. కావున ప్రతి రైతు ఈ అవకాశమును సద్వినియోగపరుచుకోవాలని అన్నారు.