రబీ సీజన్లో సాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో రబీ సాగునీరు పంపిణీపై జిల్లా కలెక్టరు కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టరు ఎస్.ఇలక్కియ, వ్యవ సాయ, నీటిపారుదల, ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ రబీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు అందించాలన్నారు. రబీ సీజన్ కు సంబంధించి రానున్న నెల రోజులు అత్యంత కీలకంకా నున్న నేపథ్యంలో సాగునీరు పంపిణీపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఇందుకు వ్యవసా యం, నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు.. క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ శివారు భూములకు సైతం పూర్తిస్థాయి లో సాగునీరు అందించేందుకు కృషి చేయాలన్నారు.
సాగునీరు పంపిణీ, వంతులు వారి విధానంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టరు తెలిపారు. అనుమతులు ఉన్నచోట క్రాస్ బండ్లు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఆయిల్ ఇంజిన్స్, కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, గుర్రపు డెక్క తొలగింపు వంటి పనులకు వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాపై కెనాల్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. తాల్లరేవు, కరప, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, సామర్లకోట ఇతర మండలాల అధికారులతో కలెక్టరు ఈ సందర్భంగా చర్చించి సాగునీటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్, రామచంద్రాపురం ఇరిగేషన్ ఈఈ విజయ గోపాల్, డ్రైన్స్ ఈఈ కె.సుబ్బయ్య, ఏపీఈపీడీసీఎల్ ఈఈ ప్రసాద్ వివిధ మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ అధికారి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.