తూర్పుగోదావరి స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి శాసన మండలి సభ్యుని ఎన్నిక నిర్వహణ ప్రక్రియలో సోమవారం మద్యాహ్నం 3-00 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి ఈ ఎన్నికల పోటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కుడుపూ డి సూర్యనారాయణ రావు ఏకైక అభ్యర్థిగా నిలవడంతో, రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఆయన ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి, జాయిం ట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రకటించి, ఆయనకు సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ అందజేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన కుడుపూడి సూర్యనా రా యణరా వుకు కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు వంగా గీత, మార్గాని భరత్ రామ్, కాకినాడ సిటీ శాససన సభ్యులు ద్వారం పూడి చం ద్రశేఖర రెడ్డి అభినందనలు తెలియజేశారు. అనంతరం నూతనంగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన కుడుపూడి సూర్యనారాయణరావు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లాను మర్యాద పూర్వకంగా కలిసారు.