పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 37 మంది


Ens Balu
20
Visakhapatnam
2023-02-27 17:03:14

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విశాఖపట్నం-విజయనగరం- శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు  సంబంధించి నామినేషన్ల ఉపసం హరణ  నాటికి  మొత్తం 3అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని , 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్ లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలతో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబం ధించి ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్ తో  కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి అభ్యర్థి మోడల్ కోడ్  నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల న్నారు. ఎమ్మెల్సీ బరిలో పాల్గొను అభ్యర్థులు ఎటువంటి ప్రభుత్వ  ప్రారంభోత్సవాలు , శంఖుస్తాపనలు కార్యక్రమాలలో పాల్గొనరాదని తెలిపా రు. ఎన్నికలకు   సంబంధించిన నియమ నిబంధనలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ అభ్యర్థులకు  వివరించారు. ఎన్నిక లకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నట్లయితే రాత  పూర్వకంగా తెలపాలని అన్నారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యక్తిగత వాహనాలు , ర్యాలీలు,  లౌడ్ స్పీకర్లు  కొరకు అభ్యర్థులు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో  జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , ఎలక్షన్ సిబ్బంది , పోటీ అభ్యర్థులు , వారి ఏజెంట్లు ఉన్నారు. 
సిఫార్సు