జి-20 సదస్సును విజయవంతం చేయాలి


Ens Balu
10
Visakhapatnam
2023-02-28 13:03:29

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023 ను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు.  సోమవారం సాయంత్రం విఎంఆర్డిఎ ఎరీనా  సమావేశ మందిరంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023  ఏర్పాట్లు, అధికారులు చేపట్టవలసిన పనులపై పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ జి. సృజన,సచివాలయల డైరెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్ తో కలసి లైజనింగ్ అధికారులు , నోడల్ అధికారులతో కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మార్చి 3, 4 తేదీలలో నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023 (గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు-2023) కు నియమించిన నోడల్ అధికారులందరూ బాధ్యత యుతంగా పని చేసి విజయవంతం చేయాలన్నారు. 

ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, అంబాసిడర్లు రానున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. అతిధులు బస చేయు హోటల్స్ వద్ద, విమానాశ్రయం వద్ద,  ఎయు గ్రౌండ్ లోనూ  వైద్య ఆరోగ్య శాఖ నుండి మెడికల్ టీంలు, ఆంబులెన్స్, మందులు అందుబాటులో పక్కాగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రతినిధులు బస చేయు హోటల్స్ వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు గావించాలని చెప్పారు.  ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు-2023కు ముఖేష్ అంబానీ, నవీన్ మిట్టల్, అదానీ తదితర ప్రముఖ వ్యాపార వేత్తలు, అంబాసిడర్లు, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నట్లు చెప్పారు. అధికారులకు అప్పగించిన విధులను బాధ్యతతో నిర్వహించి సమ్మిట్ ను విజయవంతం చేయాలని తెలిపారు. 

సమ్మిట్ కు వచ్చే పారిశ్రామిక వేత్తలను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవాలని, వారికి అవసరమైన వాహనాలు ఏర్పాట్లు గావించాలన్నారు. ముఖ్య అతిధుల సమాచారం ముందుగా తెలుసుకొని పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు. అధికారులందరూ ప్రధాన వేదిక యొక్క పూర్తి సమాచారం ముందుగా తెలుసుకోవాలని అన్నారు.  జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ సదస్సు కు విచ్చేయు ముఖ్య అతిధుల విధులకు కేటాయించిన లైజనింగ్ అధికారులు , నోడల్ అధికారులు చేయవలసిన పనులను సూక్మ స్థాయిలో అధికారులకు వివరించారు.  ఈ సమావేశంలో సమ్మిట్ లో పాల్గొను  నోడల్ అధికారులు , లైజనింగ్ అధికారులు , జిల్లా అధికారులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

సిఫార్సు