విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో వచ్చేనెల మూడు, నాలుగు తేదీలలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సు ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని రెండవ తేదీ నాటికి ప్రాంగణం మొత్తం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. మంత్రి అమర్నాథ్ వెంట పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన తదితరులు ఉన్నారు.