విధినిర్వహణలో అలక్ష్యం క్షమించేదిలేదు..


Ens Balu
5
Hindupuram
2020-09-26 15:16:19

ప్రజలకు సేవలందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జెసి సిరి అధికారులను హెచ్చరించారు. శనివారం హిందూపూర్ రూరల్  లోని కేరి కేరి  సచివాలయంలో అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రజలకు ఇంటి ముంగిటే సేవలు అందించాలనే ఉద్దేశ్యంలో సచివాలయాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతీరోజూ గ్రామవాలంటీర్లు పది ఇళ్లను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా సమావేశాల నెపంతో సచివాలయంలోనే గంటల తరబడి వేచివుండకూడదన్నారు.  అనంతరం సచివాలయంలో అందుతున్న సేవల పై ఆరా తీశారు. ఈ కార్యక్రమం లో హిందూపూర్ తహసీల్దార్, ఎంపీడిఓ తదితరులు పాల్గొన్నారు.