మహావిశాఖనగర పాలక సంస్థ పరిధిలోని పలు లోకల్ టీవిలు, ఎంఎస్ఓలకు చెందిన ఓఎఫ్సీ కేబుళ్లను జివిఎంసి సిబ్బంది ఎలాంటి ముంద స్తు నోటీసు లేకుండా తెంపేస్తున్నారు. పనిగట్టుకొని మరీ వెతికి వెతికి కట్ చేసేస్తున్నారు. నగరంలోని పలు ఎంఎస్ఓలు సుమారు పదేళ్లుగా జివిఎంసీకి కట్టాల్సిన పోల్ టేక్సులు కట్టలేదని సమాచారం. దీనితో కొత్తగా వచ్చిన జివిఎంసీ కమిషనర్ ఎంఎస్ఓలపై కొరడా ఝులిపి స్తున్నా రు. నేరుగా ఓఎఫ్సీ కేబుళ్లు కట్ చేస్తున్న విషయాన్ని కొందరు అకారణంగా కేబుల్ వైర్లు కట్ చేసేస్తున్నారని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో పెట్టడంతో విషయం తెలుసుకున్న సిబ్బంది అన్ని జోన్ల పరిధిలోనూ వైర్లు కట్ చేసే కార్యక్రమానికి పూనుకున్నారు. మరోపక్క ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు అటు పదేళ్లుగా పోస్టల్ లైసెన్సులు కూడా రెవిన్యువల్ చేయలేదని పోస్టల్ అధికారులు కూడా చెబుతున్నారు. విశాఖలో జి-20 సదస్సు జరుగుతున్నవేళ ఈ వైర్లు తెంపుడు కార్యక్రమం చర్చనీయాంశం అవుతోంది.