స్వచ్ఛంద సేవలు భేష్..


Ens Balu
4
Hindupuram
2020-09-26 15:56:23

కరోనా సమయంలో సేవలు అందించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జెసి సిరి అన్నారు. శనివారం హిందూపూర్ లోని సర్వజన ఆసుపత్రిని జెసి సందర్శించి అక్కడ అందుతున్న వైద్యసేవలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు, వైద్యులకు సేవలు అందించే ఈ ఆసుపత్రికి డా.సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్  ఆధ్వర్యంలో ఆసుపత్రికి వివిధ వైద్య సామాగ్రిని అందించడం హర్షనీయమన్నారు. దాతలు స్వచ్చందంగా ముందుకి వచ్చి ఆపదలో ఉన్నవారికి తమవంతు సహకారం అందించాలని ఆమె సూచించారు. ఇప్పటికే చాలా మంది దాతలు ప్రభుత్వ ఆసుపత్రులకు స్వచ్ఛందంగా దానాలు చేస్తూ వస్తున్నారని అన్నారు. కరోనా నియంత్రణ అయ్యేంత వరకూ ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలని జెసి సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.