ఉత్తరాంధ్రాతోపాటు మరో2 ఎమ్మెల్సీ స్థానాల్లో బిజెపీ అభ్యర్ధులే గెలుస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జోస్యం చెప్పారు. గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణు కుమార్ రాజు, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎం.రవీంద్ర, అనకాపల్లి ఇంఛార్జి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేంద్రలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం 2024 ఎన్నికల్లో్ ఖచ్చితంగా కనిపిస్తుందన్నారు. బీజేపీ ఒక్కపార్టీయే లక్ష ఎమ్మెల్సీ ఓట్లు రిజిస్ట్రేషన్లు చేయించిందన్నారు. ప్రజలకు బిజెపీ పార్టీపై అపారమైన నమ్మకం ఉందని, అదే సమయంలో అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ, వ్యతిరేక విధానాలను కూడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎవరు ఏం చేసినా గెలుపు మాత్రం బిజెపీ అభ్యర్ధులదేనన్న ఆయన జనసే కూడా ఈ ఎన్నికల్లో సహాయం చేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.