గ్రామాల రికార్డులను భద్రపరచాలి..


Ens Balu
2
Visakhapatnam
2020-09-26 18:22:23

విశాఖజిల్లా రెవెన్యూ, ఫారెస్టు శాఖలు  గ్రామాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ రికార్డులను భద్రపరచాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  జి.వి.ఎం.సి. సమావేశ మందిరంలో ఆర్.ఓ.ఎఫ్.ఆర్. జిల్లా స్థాయి సమావేశంను ఆయన నిర్వహించారు.  గ్రామాల్లో ఎవరు భూములు ఇచ్చారో వారి పాస్ బుక్ లు, టైటిల్ డీడ్స్, వారి ఫోటోలు రికార్డులలో భద్రపరచి ఉంచుకోవాలన్నారు.  ప్రొసీజర్ ప్రకారం అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు.  డాక్యుమెంటేషన్ ను రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలు భద్రపరచాలని సూచించారు.  గ్రామ సచివాలయం, తహసిల్థార్, ఆర్.డి.ఓ., సంబంధిత కార్యాలయాల్లో డాక్యుమెంటేషన్ నఖలు, ఫోటోలు పక్కాగ ఉండాలని ఆదేశించారు.  ఏజెన్సీ పరిధిలోని ఆయా మండలాల్లో ఆర్.ఓ.ఎఫ్.ఆర్.కు సంబంధించి మండలాల వారీగ ఎంతెంత భూములు ఉన్నాయో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్ కలెక్టర్ కు వివరించారు.  అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో దేవరాపల్లి, వి. మాడుగుల, చీడికాడ మండలాల్లో ఓ.ఆర్.ఎఫ్.(ఔట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్) రిజర్వ్ ఫారెస్ట్ భూములు గూర్చి అనకాపల్లి ఆర్డిఓ సీతారామారావు వివరించారు.  నర్సీపట్నం డివిజన్ లో ఆయా మండలాల్లోని ఓ.ఆర్.ఎఫ్.(ఔట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్), రిజర్వ్ ఫారెస్ట్ భూములు గూర్చి సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలియజేశారు. ఈ సమావేశములో జిల్లా జాయింట్ కలెక్టర్ వి. వేణుగోపాల్ రెడ్డి, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్  నారపురెడ్డి మౌర్య, పాడేరు సబ్ కలెక్టర్ శివజ్యోతి, డి.ఎఫ్.ఓ.లు అనంత శంకర్, వినోద్ కుమార్, విజయనగరం డి.ఎఫ్.ఓ. సచిన్, అనకాపల్లి ఆర్.డి.ఓ. సీతారామారావు, సంబంధిత తహసిల్థార్లు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.