విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ


Ens Balu
17
Visakhapatnam
2023-03-14 08:52:17

అగర్వాల్ మహాసభ సామాజిక బాధ్యతగా విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను పంపిణీ చేసినట్లు అగర్వాల్ మహాసభ విశాఖపట్నం అధ్యక్షులు విజయేంద్ర కుమార్ గుప్తా తెలిపారు. తమ సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది తొలిఅంశంగా వీల్ చైర్స్, వాకర్స్, స్టిక్స్, ఊత కర్రలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివ రించారు. రాజస్థాన్ సాంస్కృతిక మండల్ భవన్ లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఈ ఉపకరణాలను అందజేశారు. ప్రోగ్రాం చైర్మ న్ ప్రకాష్ సరోగి మాట్లాడుతూ, భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదిగిన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. కోచైర్మన్ అగర్వాల్ మాట్లా డుతూ, 3దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థ విశాఖలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అదే స్ఫూర్తితో రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తా మని ప్రకటించారు. సంధానకర్తగా సీనియర్ జర్నలిస్ట్ ఎన్.నాగేశ్వరరావు వ్యవహరించారు.