ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ చదివిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎందుకు ఓటు వేయలేదని రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. బుధవారం విశాఖలోని బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసైన సీఎంకి ఓటు లేదా..? నమోదు కాలేదా..? లేదంటే ఎందుకు నమోదు చేయించుకోలేదని అన్నారు. ఈనెల 13న జరిగిన ఎమ్మె ల్సీ ఎన్నికల్లో జగనన్న డిగ్రీ కాలేజీల్లో 5, 6, 7, 8 తరగతులు చదివిన వారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులుగా ఓట్లు వేయడాన్ని రాష్ట్ర ప్రజానీకం అంతా చూసిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపుకోసం వెండి బిళ్లలు పంచిన వైఎస్సార్సీపీ రేపు వచ్చే ఎన్నికల్లో 175 నియోజ వకర్గాల్లోనూ బంగారు బిళ్లలు పంచుతుందా అని ఎద్దేవా చేశారు. త్వరలోనే వైఎస్సార్సీపీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు. ఏపీ పోలీసులు పోలీసులుగా కాకుండా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు.