పల్నాడు జిల్లా నర్సాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో పనికిమాలిన వ్యక్తికి ఒత్తాసు పలికి స్థాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు. ‘నా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు నీకేం పని ? . నువ్వు హీరో అయితే నీ పార్టీకి గొప్ప.. నాకు కాదు’అంటూ తనదైన రీతిలో స్పందించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచిస్తూ..మూడోకన్ను తెరిచినా ఒరిగిపోయేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో లాగా జీవితంలో నటించడం కుదరదని తెలుసుకోవాలని ‘మనుషులకు మూడో కన్ను ఉండదని తెలుసుకోవాలని సూచించారు. ఏదో ఒకటి అనడం, తప్పైందని వెనక్కి తీసుకోవడం బాలకృష్ణకు అలవాటుగా మారిందని’ఎద్దేవా చేశారు. ఇటీవల నర్సాపురంలో పర్యటించిన సందర్భంగా బాలకృష్ణఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పై పలు వ్యాఖ్యలు చేయడంతో విషయం చిలికి చిలికి గాలివానలా మారింది. తాను అభిమానులకు చిటికేస్తె చాలు. జాగ్రత్త బాలక్రిష్ణ మాట్లాడటం అగ్నికి ఆజ్యం పోసిట్టైంది..!