సర్వే అక్టోబరు 15లోగా పూర్తికావాలి..


Ens Balu
4
జివిఎంసి
2020-09-26 18:55:54

విశాఖ జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమలపై సర్వే  నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు.  ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే-2020 పై శనివారం జి.వి.ఎం.సి. సమావేశ మందిరంలో పరిశ్రమల అధికారులతో సమావేశం నిర్వహించారు.  జిల్లాలోని సుమారు 11 వేల పరిశ్రమలపై సర్వే నిర్వహిం చనున్నట్లు తెలిపారు.  వీటిలో దాదాపు 7 వేలు తయారీ పరిశ్రమలు ఉన్నాయని, 144 భారీ పరిశ్రమలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.  జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, పట్టణ ప్రాంతాల్లో వార్డు అమెనిటీ సెక్రటరీలతో ఈ సర్వేను చేయనున్నట్లు వెల్లడించారు.  ఇందుకు జిల్లాలో 30 మంది లీడ్ ఆఫీసర్స్ ఎంపిక చేసి, ఈ నెల 28వ తేదీ నుండి శిక్షణా తరగతలు నిర్వహించి సర్వే ప్రారంభిస్తారన్నారు.  గ్రామీణ ప్రాంతంలో ఎంపిడిఓలు, పట్టణ ప్రాంతంలో మున్సపల్ కమీషనర్లకు ఈ బాధ్యతలు అప్పగింపబడుతుందని,  పరిశ్రమల ఎస్టేట్ లలో ఎపిఐఐసి అధికారులు, జిల్లాలోని ఇతర ప్రాంతాలలో పరిశ్రమల శాఖాధికారులు పర్యవేక్షణాధికారులుగా నియమించినట్లు చెప్పారు.  జిల్లా మొత్తంగా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులుఈ సర్వేను పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.  సర్వే కోసం వచ్చిన అధికారులకు కావలసిన పూర్తి సహాయ, సహకారాలను అందించి సహకరించవలసినదిగా పరిశ్రమల యజమాన్యాలకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ విజ్ఞప్తి చేశారు.  ఈ సర్వే ద్వారా పరిశ్రమల నుండి సేకరించిన సమాచారమును గోప్యంగా ఉంచబడుతుందని పేర్కొన్నారు.  ఈ సర్వేను అక్టోబరు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జివియంసి కమీషనర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్-(ఆసరా) గోవిందరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎ.రామలింగేశ్వరరాజు, తదితరులు పాల్గొన్నారు.