భారత క్రికెట్ జట్టు ఆటగాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్ గురువారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి.. భార్య అంజలితో కలిసి రాజశ్యామల అమ్మవారి పూజలు చేశాడు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, గుజరాత్ టైటాన్ తరపున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేందుకు అహ్మదాబాద్ క్యాంప్ కు వెళుతున్నట్లు తెలిపాడు. అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించానని అన్నాడు. ఇక్కడికి వచ్చి స్వామి దర్శించి, అమ్మవార్లకు పూజలు చేయడం ఆనందాన్ని పంచిందన్నాడు.